Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సియాజ్ హైబ్రిడ్ తో 28 కి.మీ మైలేజీ...మోస్ట్ ఫ్యూయెల్ ఎఫిసియెంట్ అంటున్న మారుతి సుజుకీ

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకొస్తోందట. సియాజ్ హైబ్రిడ్ పేరిట రంగప్రవేశం చేయనున్న ఈ కారు లీటరుకు 28 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందట. దీంతో ఇప్పటిదాకా భారతీయ రోడ్లపైకి వచ్చిన కార్లన్నింటిలోకి ఈ కారే మోస్ట్ ఫ్యూయెల్ ఎఫిసియెంట్ అని కూడా ఆ కంపెనీకి చెందిన ఓ నిపుణుడు చెబుతున్నాడు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సియాజ్ డీజిల్ వెర్షన్ కు కాస్తంత రూపురేఖలు మార్చి సియాజ్ హైబ్రిడ్ పేరిట మారుతి సుజుకీ కొత్త కారును తీసుకొస్తోందని సమాచారం. ఈ కారు హోండా సిటీకి గట్టి పోటీ ఇస్తుందని కూడా సదరు నిపుణుడు చెబుతున్నాడు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు మారుతి సుజుకీ అధికార ప్రతినిధి నిరాకరించారు. కొత్త మోడళ్లపై ముందుగానే మాట్లాడటం తమ పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

More Telugu News